హ్యాపీ బర్త్ డే ''తంగమే'' నయనకు విఘ్నేశ్ శివన్ శుభాకాంక్షలు (Video)

బుధవారం, 18 నవంబరు 2020 (14:18 IST)
దక్షిణాది లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార 37వ వసంతంలోకి అడుగుపెట్టింది. నవంబర్ 18న నయనతార పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి సినీ ప్రముఖులు నుంచి నయన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నయన్ ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. 
 
నయన్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి..  ''హ్యపీ బర్త్‌డే తంగమే (బంగారం)'' అని కామెంట్ చేశాడు. ఎల్లప్పుడూ అదే స్ఫూర్తితో, అంకితభావంతో, నిజాయితీగా ఉండాలని ఆకాంక్షించాడు. నయన్ నటించిన థ్రిల్లర్ సినిమా ''నెట్రికన్'' ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఈ సినిమాలో నయనతార అంధురాలిగా కనిపించబోతోంది. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
 
కాగా.. తెలుగు, తమిళ్‌లో సీనియర్ హీరోలతోపాటు యంగ్ హీరోలతోనూ నటించిన నయన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటారు. ఇటీవల అమ్మోరు తల్లి తొలిసారి అమ్మవారి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. నయన్ బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు