ఆర్తి అగర్వాల్ బయోపిక్ రెడీ అవుతుందా? ఆమె రోల్‌లో ఎవరు నటిస్తారో?

సోమవారం, 3 ఆగస్టు 2020 (11:55 IST)
Aarthi Agarwal
ప్రస్తుతం టాలీవుడ్‌లోను బయోపిక్‌ల హవా కొనసాగుతుంది. తాజాగా అలనాటి అందాల నటి ఆర్తి అగర్వాల్ జీవిత నేపథ్యంలో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్స్ సాధించి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌, మహేశ్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్ వంటి స్టార్స్‌తో జతకట్టిన ఆర్తీ అగర్వాల్ చిన్న వయస్సులోనే కన్నుమూసింది.
 
బరువు తగ్గడానికి జరిగిన లైపో ఆపరేషన్ వికటించడంతో కన్నుమూసిన ఆర్తి అగర్వాల్ జీవిత నేపథ్యంలో సినిమా చర్చలు నడుస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. మరి ఆర్తి పాత్రలో ఎవరు నటిస్తారు అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది.
 
కాగా అప్పట్లో హీరో తరుణ్‌తో ప్రేమ విఫలమై అవడంతో ఈమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ లైపోసెక్షన్‌ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఇప్పుడు ఈమె బయోపిక్ తెరకెక్కించేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు