పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. జనసైనికులే కాదు.. సినీ ప్రముఖులే కాదు.. పవన్ వకీల్ సాబ్‌కు ఫిదా అయిన వారిలో వైకాపా నాయకులు కూడా వున్నారు. వైకాపా తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణరాజు ట్విట్టర్‌లో వకీల్ సాబ్‌పై సానుకూల సమీక్షను పోస్ట్ చేశారు, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పోస్టులో "నా అభిమాన హీరో పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'ను చూశాను. సమాజానికి అద్భుతమైన సందేశంతో చాలా మంచి చిత్రం. పవర్‌స్టార్ అభిమానులకు విందు. తప్పక చూడండి! సినిమా పోలీసులు తప్పుడు కేసులు ఎలా దాఖలు చేస్తారు. ఆ తప్పుడు కేసులకు వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాటం చేస్తారు. నేను కూడా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులతో ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నాను. నా వకీల్ సాబ్స్ కూడా పీకే లాగా వాదించారని మరియు ఆ తప్పుడు కేసులను రద్దు చేస్తారని ఆశిస్తున్నాను." అంటూ రఘురామ కృష్ణరాజు ట్వీట్ చేశారు.
కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంపి రఘురామ కృష్ణరాజు ట్విట్టర్ సానుకూల సమీక్షకు కృతజ్ఞతలు తెలుపుతుండగా, కొంతమంది ఆయనను ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి రఘురామ కృష్ణరాజు ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.