కుక్కను చంపడానికి పులివెందుల నుంచి జనం రావాలా? రఘురామపై బాపట్ల ఎంపి

బుధవారం, 7 ఏప్రియల్ 2021 (15:01 IST)
బాపట్ల వైసిపి ఎంపి నందిగం సురేష్ వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆయన రఘురామను ఉద్దేశించి మాట్లాడుతూ... నిన్ను చంపడానికి పులివెందుల నుంచి జనాన్ని పంపారా? కుక్కను చంపడానికి అంత అవసరమా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
 
వైసిపి ఎంపి అని ఢిల్లీలో చెప్పుకుంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణ రాజు చేస్తున్నది రాజకీయ వ్యభిచారమని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డిని శ్రీరాముడు అని ఏపి ప్రజలు తేల్చి 151 సీట్లు కట్టబెట్టారనీ, నువ్వే రాక్షసులతో కలిసి పనిచేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవడం తథ్యమన్నారు. తమ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుని తీరుతామని హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు