ఈగిల్ తో ట్రూ లవర్ కు పోటీ లేదు, 200 థియేటర్స్ లో రిలీజ్

డీవీ

గురువారం, 8 ఫిబ్రవరి 2024 (16:37 IST)
SKN, Maruthi, True Lover team
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "ట్రూ లవర్". ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకువస్తున్నారు. ఇవాళ  "ట్రూ లవర్" సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు.

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ - ఈ సినిమా తమిళ ప్రీమియర్స్ చూసిన వాళ్లు ఇటీవల కాలంలో ఇలాంటి మంచి లవ్ స్టోరి రాలేదని చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇప్పటిదాకా "ట్రూ లవర్" నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ వంటి కంటెంట్ మొత్తానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ శనివారం సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. రేపు రాత్రి 9 గంటలకు సెలబ్రిటీలు, మీడియాకు కూకట్ పల్లి విశ్వనాథ్ థియేటర్ లో షో వేస్తున్నాం. మరికొన్ని థియేటర్స్ లో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. మా బేబి సినిమాకు కూడా ఇలాగే ముందు రోజు ప్రీమియర్ వేశాం. కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. ఈ సినిమా మీద అతి తక్కువ టైమ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ థియేటర్, కూకట్ పల్లిలో విశ్వనాథ్ వంటి మంచి థియేటర్స్ దొరికాయి. మారుతికి యూత్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమాను బాగా నచ్చి తీసుకున్నారు. మణికందన్ తమిళ హీరో అయినా తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పారు. శ్రీ గౌరి ప్రియ తెలుగు అమ్మాయి..తమిళం నేర్చుకుని డబ్బింగ్ చెప్పింది. వీళ్లు ఇంత కమిటెడ్ గా సినిమా కోసం పనిచేశారు. అలాగే డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ కు ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలా ఆఫర్స్ వస్తాయి. ప్రేమికురాలి విషయంలో అబ్బాయిలో ఉండే అభద్రతను తన పర్ ఫార్మెన్స్ లో సహజంగా మణికందన్  చూపించాడు. అలాగే లవర్ ఇన్ సెక్యూరిటీని చూసి బాధపడే అమ్మాయిగా శ్రీ గౌరి ప్రియ నటన ఆకట్టుకుంటుంది. మా ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు థ్యాంక్స్. రేపు "ట్రూ లవర్" ప్రీమియర్ ను కలిసి చూసి ఎంజాయ్ చేద్దాం. ఈ సినిమా ఈ వాలెంటైన్ డే విన్నర్ అవుతుంది. రవితేజ ఈగిల్ తో మా సినిమాకు పోటీ లేదు. 200 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. మాస్ మహారాజ్ రవితేజ అంటే నాకు ఇష్టం. నేను ఆయనకు పీఆర్ ఓగా పనిచేశాను. నేను ఆయనతో ఓ సినిమా కూడా చేయాలని అనుకున్నా. ఈ నెల 9వ తేదీ అనేది సోలోగా ఈగిల్ దే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ గారికి, విశ్వప్రసాద్ గారికి చెప్పి వారి అనుమతితోనే 10న "ట్రూ లవర్" రిలీజ్ కు రెడీ అయ్యాం. వాలెంటైన్ డే విన్నర్ అంటే ప్రేక్షకుల మనసుల్ని గెల్చుకుంటుందని చెప్పా. బేబి హిందీ రీమేక్ లో నేను నటిస్తున్నాను అనే రూమర్స్ లో నిజం లేదు. అన్నారు.
 
దర్శకుడు మారుతి మాట్లాడుతూ - నేను ఈ సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎలాంటి ఎగ్జైట్ మెంట్ కలిగిందో తమిళ ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పోస్ట్ లు చూస్తున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. "ట్రూ లవర్" సినిమా కథను దర్శకుడు చాలా జెన్యూన్ గా తెరకెక్కించాడు. చాలా డీప్ గా థింక్ చేసి స్క్రిప్ట్ చేశాడు. డైరెక్టర్ గా ప్రభురామ్ వ్యాస్ టాలెంట్ ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయిలు, అమ్మాయిలే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా మూవీ చూడొచ్చు. ఈ సినిమాతో ఈ వాలెంటైన్స్ డే మర్చిపోలేకుండా ఉంటుందని చెప్పగలను. మణికందన్, శ్రీ గౌరి ప్రియ పర్ ఫార్మెన్స్ లు "ట్రూ లవర్" సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతాయి. ఈ జంటతో మా మాస్ మూవీ మేకర్స్ పై స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తాం. ఎస్ కేఎన్ బేబి చేసినా, నేను ఇప్పుడు ప్రభాస్ గారితో సినిమా చేస్తూ బిజీగా ఉన్నా...ఇదొక మంచి సినిమా కావడం వల్లే ఇంతగా ప్రమోట్ చేస్తున్నాం. రేపు రాత్రి ప్రీమియర్స్ వేస్తున్నాం. తెలుగు ఆడియెన్స్ అంతా "ట్రూ లవర్"ను ఇష్టపడతారని ఆశిస్తున్నాం. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి పాయింట్ తో సినిమా రాలేదు. తను ప్రేమించిన అమ్మాయి వేరే వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ తనను అవైడ్ చేస్తే ఆ పెయిన్ ఎంతగా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీన్ని దర్శకుడు చాలా ఆక్యురేట్ గా రూపొందించాడు అనిపించింది. అన్నారు.
 
ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ - "ట్రూ లవర్" సినిమా తమిళ ప్రీమియర్స్ కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. తెలుగులోనూ అదే రెస్పాన్స్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. ఈ సినిమాను సినిమా సెలబ్రిటీస్ కు, మీడియాకు షోస్ వేయాలని ప్లాన్ చేస్తున్నాం. అంత నమ్మకంగా ఉన్నాం. "ట్రూ లవర్" సినిమా చూస్తున్నంతసేపు అబ్బాయిలైతే తమ జీవితాల్లో ఇలాగే జరిగింది అనుకుంటారు. అమ్మాయిలకూ బాగా నచ్చే సినిమా అవుతుంది. అన్నారు.
 
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ - "ట్రూ లవర్" సినిమాను తెలుగు ప్రేక్షకుల దగ్గరకు మారుతి, ఎస్ కేఎన్ గారు తీసుకెళ్లినంతగా మరెవరూ రీచ్ చేయరు అనిపిస్తోంది. తమిళంలో ఇంత మంచి మూవీ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. తమిళ ప్రీమియర్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ ఉంది. తెలుగులోనూ సూపర్ హిట్ చేస్తారని నమ్ముతున్నాం. ఒక మంచి సినిమా చేశామనే సంతృప్తి మా టీమ్ అందరిలో ఉంది. అదే నమ్మకంతో ఈ మూవీ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. అన్నారు
 
హీరో మణికందన్ మాట్లాడుతూ - ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ తప్ప ఇంకేం మాట్లాడలేను. తెలుగు నటుడిగానే నన్ను ఇక్కడి వాళ్లు రిసీవ్ చేసుకుంటున్నారు. నేను జై భీమ్, గుడ్ నైట్ చేసినప్పుడు కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రిసెప్షన్ వచ్చింది. "ట్రూ లవర్" సినిమాను మారుతి, ఎస్ కేఎన్ రిలీజ్ చేస్తుండటంతో ఇది మరో లెవెల్ కు రీచ్ అవుతోంది. తమిళ ప్రీమియర్స్ లాగే తెలుగులోనూ సక్సెస్ ఫుల్ టాక్ రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో ప్రతి సీన్ మరో సీన్ తో లింక్ అయి ఉంటుంది. మీరు ఒక్క సీన్ చూడకున్నా..ఏం జరిగింది అనేది మిస్ అవుతారు. అంత పక్కాగా స్క్రీన్ ప్లే చేసిన సినిమా ఇది. అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు