ట్యాక్స్ మినహాయింపుకు ప్రయత్నిస్తాః కేటీఆర్

మంగళవారం, 9 మార్చి 2021 (22:25 IST)
Srikaram, KTR
శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ఆచంట, గోపీఆచంట నిర్మించిన చిత్రం `శ్రీకారం`. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా న‌టించిన‌‌ ఈ చిత్రం భారీ అంచనాలతో మహాశివరాత్రి సందర్బంగా మార్చి11న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
తెలంగాణ ఐటీ మినిస్టర్  కేటీఆర్ మాట్లాడుతూ.. చాలా సందర్భాల్లో చాలా రకాలు ఈవెంట్లకు వెళ్తుంటాం. కానీ కొన్నింటికి వెళ్లినప్పుడే ఆత్మసంతృప్తి కలుగుతుంది. అలా ఇప్పుడు అనిపిస్తోంది. శ్రీకారం టీజర్ చూశాను. ఆ తరువాత 9 నిమిషాల వీడియో చూశాను. హృద‌యంతో ఈ సినిమాను నిర్మించారు. కిషోర్ ఎంత సింపుల్‌గా కనిపిస్తున్నాడో..శర్వానంద్ కూడా అంతే సింపుల్‌గా ఉన్నారు.

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు! అని అంటారు. వ్యవసాయంలోనే వ్యయం ఉంది సాయం ఉంది. ఇప్పుడు వ్యయం పెరిగింది. సాయం తగ్గింది. రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. షార్ట్ ఫిలిం తీస్తే ఫీచర్ ఫిల్మ్‌గా తీసే అవకాశం ఇచ్చారన్న నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాలి.. మంచి సినిమాతొ పాటు సందేశం ఇవ్వాలంటే కుదరదు. అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ.. అందరికీ నచ్చేలా సినిమా తీయడం అంటే కత్తి మీద సాము లాంటిది. అయితే ఈ సినిమాను బాగానే తీశారని అనిపిస్తోంది.

KTR, Sharva
బాగుందని చెప్పాలంటే సినిమా మొత్తం చూడాల్సిన పని లేదు.. అన్నం ఉడికిందో లేదో అని ఓ మెతుకు పట్టుకుని చెప్పినట్టు.. టీజర్ చూస్తేనే సినిమా బాగా తీశారని చెప్పవచ్చు. రావు రమేష్ గారికి నేను అభిమానిని. ఆయన తండ్రి రావు గోపాల్ రావు గారంటే ఎంతో అభిమానం. రావు రమేష్, శర్వా మొదటి చిత్రం గమ్యం.. మళ్లీ ఇన్నేళ్ల తరువాత చేసిన చిత్రం శ్రీకారం.. ఇదో విడ్డూరం. శర్వానంద్ ఎన్నో రకాల చిత్రాలను చేస్తుంటారు. డిఫరెంట్ సినిమాలను చేస్తూ వస్తున్నారు. మంచి ప్రయత్నాలు, మంచి సినిమాలు చేస్తూ ఉంటే ఎప్పుడూ అండగా ఉంటాం. హ‌రీష్ చెప్పిన‌ట్టు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చేందుకు నా వంతుగా ప్రయత్నిస్తాను. మంచి సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరించాలి. పైరసి లేకుండా థియేటర్లోనే సినిమాను చూడండి``అన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు