రామ్ చరణ్, చిరు, కె.టి.ఆర్ గురించి శర్వానంద్ ఏమన్నాడో తెలుసా!
శనివారం, 6 మార్చి 2021 (20:22 IST)
Srikaram team
శర్వానంద్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం `శ్రీకారం`. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు, ట్రైలర్స్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. మహాశివరాత్రి సందర్బంగా మార్చి 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, దర్శకుడు కిషోర్ బి, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట. రైటర్ సాయి మాధవ్ బుర్రా పాల్గొన్నారు. మార్చి 6 హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ, సాయిమాధవ్ బుర్రా గారు చెప్పినట్లు ఈ కథ విన్నప్పుడు చేయాలి. ఇది ఒక బాధ్యత అనిపించింది. ఇలాంటి కథలు మళ్లీ మళ్లీ రావు. రైతులు పండిస్తే కానీ తినలేం. పండించే వారు తక్కువై పోతున్నారు. తినేవారు ఎక్కువై పోతున్నారు. ఇంత మంచి కథ రాసుకున్నందుకు థ్యాంక్స్ కిశోర్. కమర్షియల్ సినిమాలు చేయడం ఈజీ. కానీ నిర్మాతలు శ్రీకారం లాంటి సినిమాను నమ్మడం ఇంత ఖర్చు పెట్టడం చాలా కష్టం.
డేరింగ్‌గా ఉంటేనే ఇలాంటివి చేస్తారు. ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ కాల్ నాకు చరణ్ నుంచి వచ్చింది. సినిమా పాయింట్ బాగుంది. ఈ సినిమా కోసం నేను ఏం చేయాలి? సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ సమయంలో మనం ఒకరికొకరం సపోర్ట్‌గా ఉండాలి అని నా మిత్రుడు రామ్‌చరణ్ చెప్పాడు. వెంటనే ఆయన చిరంజీవిగారికి చెప్పారు.
చిరంజీవిగారికి మేం చూపించాము. 8న ఖమ్మంలో జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రావడానికి ఒప్పుకున్నారు. వెంటనే కేటీఆర్ గారికి ఫోన్ చేశాం. సపోర్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో జరగబోయే ఈవెంట్‌కు రావడానికి ఒప్పుకున్నారు. పబ్లిసిటీ అని కాదు.. ఇలాంటి పెద్దవారు చెబితే యూత్ ఇన్‌స్పైర్ అవుతారని మా నమ్మకం. ట్రైలర్‌ను లాంచ్ చేసిన నితిన్, నాని, వరుణ్‌తేజ్‌లకు థ్యాంక్స్. ప్రియాంకా మంచి కోస్టార్. ప్యూచర్‌లో బిగ్ స్టార్. యువరాజ్ మంచి విజువల్స్ ఇచ్చారు" అన్నారు
Sarvanand, priyanka
నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ – శ్రీకారం సినిమా మార్చ్ 3న సెన్సార్ పూర్తయింది. 11న మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేస్తున్నాం. శ్రీకారం చాలా పాజిటివ్ టైటిల్. ఒక యువ రైతు కథ. స్ట్రాంగ్ డైలాగ్స్, బలమైన ఎమోషన్స్‌తో ఈ సినిమాను చేశాం. మన చుట్టూ కనిపించే క్యారెక్టర్స్‌తో డిజైన్ చేసిన సినిమా ఇది. మిక్కీజే మేయర్ మంచి సంగీతం అందించారు. సాయిమాధవ్ బుర్రా గారు ఎమోషనల్ డెప్త్ ఉన్న సీన్స్‌కు అంతే డెప్త్‌గా ఇచ్చారు.
ఈ సినిమాకు డైలాగ్స్ అనేవి పెద్ద ఎస్సెట్. 2016 నుంచి ట్రావెల్ అయ్యి 2019లో శ్రీకారం సినిమాను స్టార్ట్ చేశాం. కిశోర్‌కు మంచి భవిష్యత్ ఉంది. నరేష్, ఆమని, రావు రామేష్ బాగా చేశారు. ప్రియాంకా బాగా పెర్ఫార్మ్ చేసింది. శర్వా క్యారెక్టర్‌లో జీవించారు. కరోనా వల్ల సినిమా షూటింగ్‌కు బ్రేక్ వచ్చినా కూడ సినిమా స్టార్టింగ్‌లో చూపించిన ఎగై్జట్‌మెంట్‌నే చూపించారు అని చెప్పారు.
డైరెక్టర్ కిశోర్. బి మాట్లాడుతూ – టీజర్, టైలర్స్ చూశారు. మనందరం దాదాపు వ్యవసాయ కుటుంబాల నుంచే వచ్చినవాళ్లుం ఉంటాము. ఎక్కడో ఒక చోట మనం కనెక్ట్ అవుతాం. మనల్ని మనం స్క్రీన్ పై చూసేందుకు ఈ నెల 11న వస్తున్నాం. సినిమా చూస్తున్నప్పుడు మన కథో, మన పక్క ఊరి కథో ఏదో ఒకటి చూస్తున్న భావన కలుగుతుంది. మా సినిమాను చూసిన వారు వారి కుటుంబసభ్యులు అందరికీ చూపించండి. ఒక షార్ట్ ఫిల్మ్ చూసి, నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. నా కథను నేను స్క్రీన్‌పై చూసుకున్నట్లుగా ఫీలై బయటకు వస్తారు. శర్వానంద్‌గారు చాలామంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. ఆయన ఎందుకు అలా చేశారో నాకు అర్థం అయ్యింది. నన్ను సపోర్ట్ చేసిన శర్వానంద్‌గారికి థ్యాంక్స్.
రైటర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ, శర్వానంద్‌గారికి మళ్ళీ మళ్లీ రాని రోజు సినిమా తర్వాత శ్రీకారం సినిమా చేశాను. రైతు బ్యాక్‌డ్రాప్ సినిమా ఇది. కిశోర్ కథ చెప్పిన వెంటనే ఈ సినిమా చేయాలి అని అనుకున్నాను. ఇలాంటి సినిమా చేయడం నా బాధ్యత. ఒక సంతోషాన్నిచ్చే సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. బంధాలకు, భూమికి ఉన్న ప్రేమకథ చిత్రం రైతును, భూమిని కమర్షియల్ పాయింట్‌గా చూపించాలన్న నిర్మాతలను అభినందిస్తున్నాను.
కిశోర్ మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. తొలి సినిమాయే అయినా అనుభవం ఉన్న దర్శకుడిలా చేశాడు. శర్వానంద్‌గారి ప్రతిభ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. మంచి కథలనే ఎంచుకునే ఓ అరుదైన నటుడు శర్వానంద్. హిట్స్, ఫ్లాప్స్ ఉండొచ్చు. కానీ కథ మాత్రం బాగుండకూడదు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ శర్వానంద్‌కు మాత్రమే సూట్ అవుతుంది. ఈ భూమి మీద పైసా కూడ దోచుకోలేనిది ఒక్క రైతు మాత్రమే. తండ్రికి, కొడుక్కు మధ్య ఉన్న ప్రేమకథ ఈ చిత్రం భూమికి మనిషికీ మధ్య ఉన్న ప్రేమకథ ఈ చిత్రం అన్నారు.
ప్రియాంకా అరుల్ మోహనన్ మాట్లాడుతూ- ఇంత మంచి సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు తమ ఫ్యామిలీస్‌తో వెళ్లి ఈ సినిమాను చూడండి. శర్వాందన్ మంచి కో స్టార్.మంచి సంగీతం అందించిన మిక్కి జే మేయర్‌కు థ్యాంక్స్" అన్నారు