రాంగోపాల్ వర్మ "వ్యూహం"కు మళ్లీ దెబ్బ : సస్పెన్ ఎత్తివేతకు నిరాకరణ

వరుణ్

సోమవారం, 22 జనవరి 2024 (14:22 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం విడుదలకు ఇప్పట్లో చిక్కులు వీడిలా కనిపించడం లేదు. ఈ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ సస్పెన్షన్‌ను తెలంగాణ హైకోర్టు పొడగించింది. తాజాగా మరో మూడు వారాల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు నిపుణుల కమిటీని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లోపు చిత్రానికి సంబంధించిన కొత్త సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
 
'వ్యూహం' సినిమాకు సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ తరపు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే తెలంగాణలోనైనా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. 
 
దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరించిన 'వ్యూహం' సినిమా ప్రదర్శనకు సీబీఎఫ్‌సీ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ లోకేశ్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ సర్టిఫికేట్‌పై సస్పెన్షన్ విధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు