శ్రీవారి భక్తుల కోసం తితిదే మొబైల్ కొత్త యాప్

శుక్రవారం, 27 జనవరి 2023 (13:18 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శ్రీవారి భక్తుల కోసం కొత్తగా ఓ మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను జియో ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్టు తితిదే శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ యాప్ ద్వారా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్.వి.బి.సి)లో వచ్చే అన్ని రకాల కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని తెలిపింది.
 
అలాగే, శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనంతో పాటు అర్జిత సేవా టిక్కెట్లను భక్తులు నేరుగా బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్టు తెలిపారు. యాప్‌లో తిరుమల చరిత్ర, స్వామివారి కైంకర్యాల వివరాలను పొందుపరిచినట్టు వెల్లడించింది.
 
మరోవైపు ఆనంద నిలయం బంగారు తాపడం పనులకు కొద్దిగా సమయం పడుతుందని తితిదే పేర్కొంది. టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యాక పనులు మొదలు పెడతామని వివరించింది. రథసప్తమి సందర్భంగా వాహన సేవలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపింది. గ్యాలరీల్లో ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు, నీరు, పాలు, ఉచితంగా అందిస్తామని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు