నటిగా, రచయితగా, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా నెటిజన్లకు సరైన సమాధానంతో షాక్ ఇచ్చింది. పుస్తకాల మీద కూర్చుని ట్వింకిల్ దిగిన ఫోటోను నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. తన కాలి కింద వున్నవి కూడా పుస్తకాలే అనుకుని ఆమెపై నెటిజన్లు ఫైర్ అయ్యారు.
కానీ నెటిజన్లు వెంటనే పుస్తకాల మీద కూర్చోవడం కూడా తప్పేనంటూ కామెంట్లు చేశారు. ఈ కామెంట్లపై ట్వింకిల్ ఖన్నా నెటిజన్లకు షాకిచ్చే కామెంట్స్ పెట్టింది. తనకు పుస్తకాల మీద కూర్చునేందుకు ఎలాంటి సంకోచం లేదు. వాటి పక్కనే పడుకుంటా.. వీలైతే బాత్రూమ్‌కి కూడా తీసుకెళ్తానని సమాధానమిచ్చింది. పుస్తకాలను చదివినపుడే జ్ఞానం వస్తుంది, వాటిని గౌరవించినపుడు కాదంటూ గట్టిగా సమాధానమిచ్చింది. దీంతో నెటిజన్లు షాక్ తిన్నారు.