ఈ ఘటన వీడియోలో రికార్డయ్యింది. రాత్రి వేళ భోజనం చేసిన ఓ వ్యక్తి కాస్తంత వ్యాహ్యాళికి వెళ్లివద్దామని గేటు వరకూ వచ్చాడు. ఇంతలో అటుగా పులి కూడా వస్తోంది. అటు పులి ఇటు మనిషి ఎదురుపడ్డారు. విచిత్రంగా మనిషిని చూసిన పులి ఏమని భ్రమించిందో తెలియదు కానీ తోక ముడిచి పరుగులు తీసింది. ఇక క్రూర జంతువులంటే భయపడే మనిషి కూడా ఇటువైపు పరుగులు తీసాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ఒక జంతువును చూసిన మరో జంతువు. రెండూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని పారిపోయాయి అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.