ఆర్జీవీ కొత్త సినిమా.. ఇద్దరమ్మాయిలు లవర్స్‌గా మారిపోతే..?

శనివారం, 15 మే 2021 (18:51 IST)
RGV
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా సంచలన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటి వరకు ఎవరూ టాలీవుడ్‌లో తీయని సినిమాతో సంచలనంగా మారారు. 
 
ఇద్దరు అమ్మాయిలు లెస్బియన్‌గా మారితే ఎలా ఉంటుందనే కొత్త కథతో ఆర్జీవీ తీస్తున్నాడు. ఓ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఇద్దరు అమ్మాయిల మధ్య రొమాన్స్‌ను హైలెట్ చేస్తున్నాడు ఆర్జీవీ. ఇప్పటివకే విడుదలైన పోస్టర్లు, టీజర్ అంచనాలు పెంచేశాయి.
 
మగాళ్ల మీద విరక్తి పుట్టిన ఇద్దరు అమ్మాయిలు తామే లవర్స్ లాగా మారిపోయి రొమాన్స్ చేసుకునే సీన్స్ ఈ సినిమాలో హైలెట్ గా ఉన్నాయి. వీరిద్దరూ కలిసి మర్డర్ క్రైమ్‌లో ఎలా ఇరుక్కున్నారు అనే కథనే డేంజరస్‌. 
 
మరి ఆర్జీవీ తీస్తున్న ఈ సంచలనం ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో. ఈ సినిమాను కూడా తన స్పార్క్ ఓటీటీలోనే విడుదల చేయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించాడు. ఇందులో నైనా గంగూలి, అప్సరా రాణి లెస్బియన్‌గా కనిపించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు