చిరు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' రూ.200 కోట్ల బడ్జెట్, ఐశ్వర్యా రాయ్ జోడీ...

శనివారం, 20 మే 2017 (19:39 IST)
చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారీ అంచనాలతో తెరకెక్కనున్న చిత్రం. ఆంగ్లేయులపై సమరానికి దిగిన తొలి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కాగా ఈ చిత్రాన్ని బాహుబలి 2 చిత్రానికి పెట్టిన బడ్జెట్ రూ.200 కోట్లకు సమానంగా పెట్టేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. వీఎఫ్ఎక్స్, ఆర్ట్ వర్క్ పైన నడిచే ఈ చిత్రం పూర్తయ్యేందుకు రెండు నుంచి మూడేళ్లు పడుతుందని అంటున్నారు. 
 
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన ఐశ్వర్యా రాయ్ నటించే అవకాశం వున్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నిర్మిస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి