చిరంజీవి, నాగార్జునతో కేంద్రమంత్రి అనురాంగ్‌ సింగ్‌ ఠాకూర్‌ చర్చ సినిమాకేనా!

సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (11:55 IST)
Chiranjeevi, Nagarjuna, Anurang Singh Thakur, Allu Aravind
మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌లతో కేంద్ర సమాచారం, బ్రాడ్‌కాస్టింగ్‌ శాఖ, యువజన వ్యవహారాల శాఖా మంత్రి అనురాంగ్‌ సింగ్‌ ఠాకూర్‌ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని చిరంజీవి తన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఠాగూర్‌ను వారు సన్మానించారు. ప్రియమైన శ్రీ ఠాకూర్‌ గారికి ధన్యవాదాలు. నిన్న మీ హైదరాబాద్ పర్యటనలో నా దగ్గరికి రావడానికి సమయం కేటాయించినందుకు. నా సోదరుడి (నాగార్జున) తో కలిసి భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరియు అది వేగవంతమైన పురోగతి గురించి!మేము చేసిన సంతోషకరమైన చర్చ నచ్చింది అని ట్వీట్ చేసారు. 
 
Chiranjeevi, Nagarjuna, Thakur
ఇప్పటికే తెలుగు సినిమా ఖ్యాతి ఖండాతరాలకు వ్యాపించడం, ఆస్కార్‌ నామినివరకు వెళ్ళడం, చిరు కుమారుడు రామ్‌చరణ్‌కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం వంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఠాగూర్‌ రాక ఆసక్తిగా మారింది. 
 
కాగా, భారతీయ చలనచిత్రరంగం పురోగతిని గురించి చర్చించినట్లుగా చిరంజీవి ట్వీట్‌ను బట్టి తెలుస్తోంది. దానితోపాటు రాబోయే రాజకీయ పరిణామల గురించి కూడా చర్చ జరిగి వుండవచ్చని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవి బిజెపిలో ప్రవేశిస్తారనే టాక్‌ కూడా వుంది. కానీ ఆయన ఆ తర్వాత పవన్‌ పార్టీలోనే ఉంటా అంటూ ప్రకటించారు. మరి పవన్‌ కూడా బిజెపితో సన్నిహితంగా వుండడం అందరికీ తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు