"నేను సింహం అయితే.. తాను సింగం.. నేను లెజెండ్ అయితే అతను రోలెక్స్ అంటూ ఇలా సూర్యను ఎలివేట్ చేసేశారు బాలయ్య. అలాగే అన్నదమ్ములైన సూర్య, కార్తీల మధ్య గల సంబంధాన్ని, వారి ప్రేమను బయటపెట్టే ప్రయత్నం చేశారు. కార్తీ, సూర్య, బాలయ్య ముచ్చట్లు ఎపిసోడ్‌కే హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.
ఇక సూర్య పెట్టిన ఫౌండేషన్, ఉచిత విద్య, పిల్లల వీడియోలు వేయించి బాలయ్య అందరినీ ఎమోషనల్ చేశాడు. ఇక చిన్న పిల్ల మాటలకు సూర్య కంట తడి పెట్టేశారు. అలాగే మొదటి క్రష్ ఎవరో చెప్పాలని కోరారు. కానీ సూర్య వద్దు సర్ ఇంటికి వెళ్లాలని.. గొడవలు అవుతాయని ఫన్ చేశారు. ఇంకా జ్యోతిక లేని జీవితాన్ని ఊహించుకోలేనని సూర్య భావోద్వేగానికి లోనైయ్యారు. మానవత్వం వున్న మనిషిగా నలుగురికి సేవ చేయడంలోనే తనకు ఆనందం వుందన్నారు.
ఇక బాలయ్య కార్తికి లైవ్‌లో ఫోన్ చేసి సూర్య గురించి అడిగారు. ఒక హీరోయిన్ అంటే సూర్యకు బాగా ఇష్టమని చెప్పడంతో కార్తీని సూర్య "నువ్వు కార్తివి కాదు.. కత్తివి రా" అంటూ చెప్పారు. ఈ కార్యక్రమంలో కంగువ నటులు బాబీ డియోల్, దర్శకుడు శివ పాల్గొన్నారు.