మెగాస్టార్ చిరంజీవి కోడలు. రామ్ చరణ్ భార్య ఉపాసన పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ కూడా ఈమెనే. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా అసోసియేషన్ తరఫున ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ కార్యక్రమానికి ప్రచారకర్తగా ఆమె నియమితులయ్యారు. దీనిపై ఆమె స్పందిస్తూ, కరోనా వేళ ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఫ్రంట్ లైన్ వారియర్స్ నిరంతరం పోరాడుతున్నారని అన్నారు. అలాగే, అడవుల్లో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ క్షేత్ర సిబ్బంది కూడా కఠిన వాతావరణ పరిస్థితుల్లో కష్టపడుతుంటారని వివరించారు.