కంగనా రనౌత్, ఊర్మిళాల మధ్య వివాదం.. ఇప్పట్లో ముగిసేట్లు లేదే..!?
సోమవారం, 4 జనవరి 2021 (20:24 IST)
Kangana _Urmila
బాలీవుడ్ క్వీన్ కంగనా, ఊర్మిళా మటోంద్కర్ మధ్య వివాదం రాజుకుంటోంది. రాజకీయ విభేదాల తరహాలో కంగన, ఊర్మిలా ఒకరినొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అక్రమ మార్గాల్లోనే ఊర్మిళ రూ.3 కోట్లు వెచ్చించి ఆఫీసును కొనుగోలు చేసిందని కంగనా రనౌత్ చేసిన తాజా ఆరోపణలపై ఊర్మిళ ధీటుగా స్పందించింది.
ఈ సందర్భంగా వీడియో వెలువరించిన ఊర్మిళ తాను చిత్రసీమలో కష్టపడి సాధించిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించిన చట్టబద్ద పత్రాలను ఎక్కడైనా సరై చూపించడానికి సిద్దంగా ఉన్నానని, కంగనా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తన ఆస్తుల లీగల్ పత్రాలను చూపించడానికి సిద్ధంగా ఉన్నానని ఊర్మిళ స్పష్టం చేసింది.
''నమస్తే కంగనాజీ నా అక్రమాస్తుల గురించి దయతో మీరు చెప్పిన మాటలు విన్నాను. దేశం మొత్తంగా మీ ఆరోపణలను విన్నది. ఈరోజు యావద్దేశం ముందర నేను మీకో విషయం చెప్పదలిచాను. మీరు ఎక్కడికి ఎ సమయంలో రావాలని సూచిస్తే అక్కడికి వచ్చి నేను కొన్న ఆస్తుల పత్రాలను చూపిస్తాను.
పాతికేళ్లకుపైగా చిత్రసీమలో కష్టపడిన తర్వాత 2011లో ముంబైలోని అంధేరిలో నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను. ఆ ప్లాట్‌కి చెందిన లీగల్ పత్రాలను నేను తీసుకొస్తాను. ఆ ఇంటిని 2020 మార్చినెలలో అమ్మేశాను. దానికి సంబంధించిన పత్రాలను కూడా మీకు చూపిస్తాను.
పాత ఇంటిని అమ్మివేయగా వచ్చిన డబ్బుతో కొత్త ఇల్లు కూడా ఈ మధ్యే కొనుక్కున్నాను దాని చట్టబద్దమైన పత్రాలను కూడా తీసుకొస్తాను. కానీ రాజకీయాల్లోని నేను ప్రవేశించకముందే ఈ కొత్త ప్లాట్ కొనుక్కున్నాను అంటూ ఊర్మిళ సవాలు చేసింది. చట్టబద్దంగా నేను చేసిన ఆస్తుల కొనుగోళ్లకు నాకు దగ్గిన ప్రతిఫలం ఇది. దేశంలో నాలాంటి లక్షలాది, కోట్లాది పన్ను చెల్లింపుదారులు చెల్లించిన డబ్బును ఉపయోగించుకుంటా ప్రభుత్వం నుంచి వై ప్లస్ కేటగిరీ రక్షణ పొందావు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన అనేకమంది బాలీవుడ్ వ్యక్తుల పేర్లను మాదక ద్రవ్యాల నిరోధక సంస్థకు ఇస్తానని గతంలోనే చెప్పావు.
దేశం మొత్తంగా దానికోసం వేచి చూస్తోంది. దేశం సంక్లిష్ట పరిస్థితిలో ఉన్న విషయం నీకూ తెలుసు. మనందరం కలసి డ్రగ్స్ మహమ్మారిపై పోరు చేద్దాం.. దయచేసి మీ వద్ద ఉన్న ఆ పేర్ల జాబితాను కాస్త బయటపెట్టవా. నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను అంటూ ఊర్మిళ ట్వీట్ చేసింది.
ఆదివారం బాలీవుడ్ నటి ఊర్మిళ పై కంగనా పదునైన ట్వీట్ చేయడం తెలిసిందే. ప్రియమైన ఊర్మిళాజీ, నేను ఎంతో శ్రమించి కట్టుకున్న ఇళ్లను కాంగ్రెస్ కూల్చి వేసింది. బీజేపీని సంతోష పెట్టినందుకు నాకు దక్కిన ప్రతిఫళం ఏమిటంటే 25 కోర్టు కేసులను ఎదుర్కొంటూ ఉండటమే. నేను కూడా మీలాగే స్మార్ట్ అమ్మాయిని.
కానీ కాంగ్రెస్‌ని నేను మరోలా సంతోషపెట్టినట్లుంది. బుద్దిలేని దాన్ని మరి.. అంటూ కంగనా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.గత డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీనుంచి శివసేనలో చేరిన ఊర్మిళ అంతకు ముందు నుంచే కంగనాపై మాటల యుద్ధానికి తెరతీసింది. పరస్పరం పేర్లు పెట్టి మరీ విమర్శించుకున్నారు.