ఎన్నికలు వచ్చేశాయి. మరో రెండురోజులు మాత్రమే సమయముంది. ఎపిలో జరుగుతున్న ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఒక చర్చ కూడా జరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండటంతో విశ్లేషకులే ఆశక్తిగా తిలకిస్తున్నారు. అయితే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కూడా ఇప్పటికే కల్పించారు.
అయితే ఓటు గురించి సినీ నటి మెహరీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఒక నటిని. ఎప్పుడూ బిజీగా ఉంటాను. నేను పుట్టింది పంజాబ్ అయినా నా ఓటు అక్కడ ఉన్నా నేను ఎన్నికలప్పుడు మాత్రం మా ప్రాంతానికి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుని వస్తాను. ఓటు విలువ నాకు బాగా తెలుసు. నాకు బాగా గుర్తుంది 18 యేళ్ళ వయస్సు నాకు నిండిన తరువాత అదే సంవత్సరం ఎన్నికలు కూడా వచ్చాయి.
నేను ఎంతో ఆసక్తితో ఓటు హక్కును వినియోగించుకున్నాను. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఓటు ఎంతో కీలకమైనది. దయచేసి ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు హక్కును వినియోగించుకోలేని వారిని కొన్ని జంతువులతో పోలుస్తారు. అది నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పదో ముందు తెలుసుకోండి. ఓటును అమ్ముకోకండి.. నమ్ముకోండి అంటూ మెహరీన్ చెబుతున్నారు.