మీరు ఓటువేయాలంటే వీటిలో కనీసం ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలట..!

మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (17:24 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్లకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. అందులో భాగంగా ఫోటో ఓటర్ స్లిప్‌లను గుర్తింపు కార్డులుగా పరిగణించడం లేదని, ఈసీఐ ఆదేశాల మేరకు ఎపిక్ (ఓటరు గుర్తింపు) కార్డు లేదా మరో 11 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని ఓటర్లకు సీఈవో సూచించారు. 
 
1) పాస్‌పోర్ట్, 
2) డ్రైవింగ్ లైసెన్స్, 
3) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ ప్రభుత్వరంగ సంస్థలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీచేసిన ఉద్యోగుల ఫోటో గుర్తింపుకార్డు, 
4) బ్యాంకులు, పోస్టాఫీసులు ఫోటోతోపాటు జారీచేసిన పాస్ పుస్తకాలు, 
5) పాన్‌కార్డు, 6) ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీచేసిన స్మార్ట్‌కార్డు, 
 
6) నరేగా జారీచేసిన ఉపాధిహామీ పత్రం, 
7) ఆరోగ్య బీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్, 
8) ఫోటోజత చేసి ఉన్న పింఛన్ పత్రాలు, 
9) ఎంపీ/ ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు పత్రం, 
10) ఆధార్ కార్డు
 
పైన పేర్కొన్న వాటిల్లో ఏదో ఒక గుర్తింపు కార్డును చూపించిన వారిని మాత్రమే ఓటు వేయనిస్తారని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు