ఈ క్రమంలో జీ తెలుగు భారీ రేటుకు వకీల్ సాబ్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి సారి వకీల్ సాబ్‌ను చానెల్‌లో ప్రసారం చేస్తుండటంతో భారీ ఎత్తున ప్రచారం చేశారు. భారీ ఫ్లెక్సులు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. కొత్త సినిమా థియేటర్లో వస్తే ఎలా ఉంటుందో.. వకీల్ సాబ్ టెలివిజన్ ప్రీమియర్‌కు అలాంటి సందడిని క్రియేట్ చేశారు.
టీవీలో వకీల్ సాబ్ వస్తోందని తెగ ప్రచారం చేసేశారు. దానికి తగ్గట్టే భారీ టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా వకీల్ సాబ్ 19.12 రేటింగ్ సాధించేసింది. అయితే ఇది చాలా తక్కువే. మామూలుగా కొత్త సినిమాలు ఇలా టీవీల్లో వస్తే.. పెద్ద హీరోలకు 20కి పైనే రేటింగ్ వస్తుంది. ఆ లెక్కన చూస్తే ఇది చాలా తక్కువే. కానీ కొన్ని లెక్కలను పరిశీలిస్తే ఇదే ఎక్కువ.
అయితే, ఇటీవలి కాలంలో ఈ తరహా టీఆర్పీ సాధించిన చిత్రం మరొకటి లేదు. ఈ ఏడాది బహుశా ఇప్పటివరకు ఇదే అత్యధిక టీఆర్పీ అని తెలుస్తోంది. ఇక జీ తెలుగు చరిత్రలోనే ఇంతటి టీఆర్పీ సాధించిన నాలుగో సినిమాగా వకీల్ సాబ్ రికార్డ్ క్రియేట్ చేసింది. జీ తెలుగుకు ఉన్న రీచ్ ప్రకారం వకీల్ సాబ్ 19.12 రేటింగ్ సాధించడం గొప్ప విషయమే.