ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి వి వి దానయ్య క్లాప్ ఇచ్చారు. లౌక్య సాయి కెమెరా స్విచ్ ఆన్ చేయగా బెక్కం వేణుగోపాల్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. హీరో తిరువీర్, శ్రీను గవి రెడ్డి మేకర్స్ కు స్క్రిప్ట్ అందజేస్తారు.
ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ డీవోపీ గా పని చేస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్. స్నిగ్ధ మణికాంత్, పూజిత సహా నిర్మాతలు వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రామాంజనేయలు ఆర్ట్ డైరెక్టర్.
కె హర్ష వర్ధన్ మాట్లాడుతూ.. చాలా కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఒక దొంగ, దేవుడు, దెయ్యం నేపధ్యంలో వుంటుంది. ఇప్పుడు ఒక దేవుడు, దెయ్యాన్ని విడుదల చేస్తున్నాం. దొంగ ఎవరనేది త్వరలో ఆడియన్స్ పట్టుకుంటారు'' అన్నారు.