అయితే ఆ పోస్ట్‌ను వర్మ చూసి, ఈమె ఎవరో గెస్ చేయండి? అంటూ నెటిజన్లు పరీక్ష పెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే ఆమె మంచు లక్ష్మీ అనే విషయాన్ని రివీల్ చేస్తూ, పొగడ్తలలో ముంచెత్తాడు. నువ్వు చేయలేని పని ఏదైనా అసలు ఉందా? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను”అంటూ పొగిడేశాడు. దానికి మంచు లక్ష్మీ హర్షం వ్యక్తం చేస్తూ, ఓ ఆర్టిస్టుగా నేను చేయలేనిది ఏదీ లేదు. అందుకే నన్ను నేను ఆర్టిస్టిక్ కిల్లర్ గా చెప్పుకుంటాను” అని బదులిచ్చింది.