గత వారం అంతా అటు సోషల్ మీడియాలో ఇటు టీవీ ఛానళ్లలో సినిమా టిక్కెట్ల ధరలపై దుమ్ము రేపిన RGV చివరికి సీమటపాకాయ్ మాదిరిగా తుస్ మనిపించారు. మంత్రి నానితో సమావేశమయ్యాక అందరూ మాట్లాడినట్లే... నేను చెప్పాల్సింది చెప్పాను, ఆనక ప్రభుత్వం ఇష్టం అని మీడియాకు చెప్పేసి వెళ్లిపోయారు.
కానీ ఏదో సీరియస్‌గా రంగంలోకి దిగారనీ, వర్మ దెబ్బకి ఏపీ ప్రభుత్వం తక్షణమే తన జీవోను ఉపసంహరించుకుంటుందని అనుకున్నవారు లేకపోలేదు. కానీ వర్మ అంటే అంత ఈజీగా ఎవ్వరికీ అర్థంకారు కదా. మరి మంత్రిగారితో వర్మ ఏం చెప్పారో.... ఫలితం ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే. మరి ఈలోపు మళ్లీ వర్మ తన ట్విట్టర్ పేజీకి ఏమయినా పనికల్పిస్తారేమో ఎదురుచూద్దాం.