Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

సెల్వి

మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (20:36 IST)
ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి మంగళవారం స్థానిక కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. స్వాగత్ కుమార్ భోయ్ (42) అనే ఆ వ్యక్తి, 2017లో ఒక మహిళతో స్నేహం చేసి, ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి, అనేకసార్లు ఆమెను లైంగికంగా వాడుకున్నాడు. 
 
ఆ మహిళ వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో, స్వాగత్ ఆమెను దూరం పెట్టాడు. ఇంకా చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుపై, పోలీసులు నవంబర్ 28, 2017న కేసు నమోదు చేశారు. విచారణ తర్వాత, కోర్టు ఆ వ్యక్తికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 5,100 జరిమానా విధించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు