శేఖర్‌ కమ్ముల ప్రీ ప్రొడక్షన్ వర్క్‌షాప్‌ స్టార్ట్ .. హాజరైన వరుణ్‌తేజ్ - సాయిపల్లవి

శుక్రవారం, 8 జులై 2016 (16:56 IST)
'ఆనంద్'‌, 'లీడర్'‌.. ఫేమ్‌ శేఖర్‌ కమ్ముల.. కొత్తవారితో చేసే ప్రయోగాలు తగ్గించాడు. ఈసారి మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్‌తేజ్‌తో లవ్‌, సెంటిమెంట్‌ చిత్రాన్ని తీయడానికి ప్లాన్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు సాగుతున్నాయి.
 
తన సినిమాలకు ముందుగా ఆర్టిస్టులకు వర్క్‌షాప్‌ నిర్వహించడం మామూలే. ఈసారికూడా వరుణ్‌తేజ్‌, హీరోయిన్‌ సాయిపల్లవిలకు స్క్రిప్ట్‌ ఇచ్చి.. డైలాగ్‌ డిక్షన్‌... మేనరిజం వంటివాటిని శిక్షణ ఇస్తున్నాడు.
 
ఈ సందర్భంగా తీసిన ఫొటోలను చూడవచ్చు. త్వరలో సెట్‌పైకి వెళ్ళనున్న ఈచిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. మెగాఫ్యామిలీ హీరోలతో దిల్‌రాజు.. ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అందరితోనూ సినిమాలు తీయడం విశేషం. 

వెబ్దునియా పై చదవండి