స్పెయిన్‌లో మిస్టర్ షూటింగ్ వాయిదా.. ఎందుకు?

మంగళవారం, 17 మే 2016 (11:23 IST)
శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా రూపొందనున్న ఈ సినిమా 'మిస్టర్‌'. ఈ నెల 21న సెట్స్‌ పైకి వెళ్లవలసి వుంది. నెల రోజులపాటు స్పెయిన్‌లో మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ జరపాలని అనుకున్నారు. కానీ ఈ షెడ్యూల్‌ జూన్‌‌కి వాయిదా పడిందనేది తాజా సమాచారం. దానికి కారణం.. అక్కడ రకరకాల లొకేషన్స్‌ను అన్వేషించడానికి అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం పట్టిందట. 
 
దాంతో ముందుగా ఆర్టిస్టుల దగ్గర తీసుకున్న డేట్స్‌ విషయంలో సమస్య తలెత్తిన కారణంగా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. జూన్‌ మొదటివారంలో మొదటి షెడ్యూల్‌ షూటింగును ఆరంభించనున్నారు. వరుణ్‌ తేజ్‌ సరసన ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారు.

వెబ్దునియా పై చదవండి