ఈ సందర్భంగా దర్శక నిర్మాత గూన అప్పారావు మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలోని మందస ప్రాంతంలో జరిగిన జమీందారి వ్వతిరేఖ పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ పోరాటాన్ని సంఘటన స్థలంలోనే భారీగా చిత్రీకరించాం. అప్పుడు జరిగిన పోరాటంలో ఐదుగురు రైతులతో పాటు , ఇద్దరు పోలీసులు మృతి చెందుతారు. మరో 15 రోజుల వ్యవధిలో తీవ్రంగా గాయపడ్డ 25 మంది రైతులు, ఏడుగురు పోలీసులు మృతి చెందుతారు. 42 మంది రైతులకు బ్రిటిష్ ప్రభుత్వం మరణ శిక్ష విధిస్తుంది. ఈ నేపథ్యాన్ని ఎంతో సహజంగా, అప్పటి నేటివిటీ మిస్ కాకుండా చిత్రీకరించాం. ఇటీవల మా చిత్రానికి సంబంధించిన పోస్టర్, టీజర్ లను శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రయివేట్ హోటల్ లో ప్రముఖ వైద్య నిపుణుడు డా. డానేటి శ్రీధర్ విడుదల చేశారు. ప్రస్తుతం మా చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు జరుగుతున్నాయి. త్వరలో పాటలు రిలీజ్ చేసి సినిమాను డిసెంబర్ మూడో వారంలో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.