balakrishna, pawan kalyan team
నటసింహం నందమూరి బాలకృష్ణతో పాటు వీరసింహారెడ్డి బృందం పవన్ కళ్యాణ్ సెట్స్‌లో కలిశారు. ఇది చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యుగాల కోసం ఒక ఫ్రేమ్ అంటూ కాప్షన్ కూడా పెట్టింది. నిజంగానే ఇద్దరు హేమాహేమీలు ఇలా కలవడం చాలా విశేషం. ఎందుకు కలిశారు అనేది పూర్తిగా వివరించక పోయినా హైదరాబాద్ శివారులో హరిహర వీరమల్లు, వీరసింహా రెడ్డి చిత్రాల షూటింగ్ పక్క పక్కనే జరుగుతున్నాయని తెలిసింది.