తాకినా పీకినా గోకినా శ్రుంగారం రావడం లేదు... 'ఇండీవుడ్'లో వెంకయ్య వ్యాఖ్యలు

మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (20:35 IST)
నాలుగు రోజులుగా రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతున్న ఇండీవుడ్ ముగింపు కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు భారతదేశ సినీ ఇండస్ట్రీ స్థితిగతులపై విపులంగా మాట్లాడారు. ముఖ్యంగా నేటి సినిమాల పరిస్థితిపై ఆయన చురకలు వేశారు. ఆనాడు శ్రుంగారాన్ని కళ్లతో, నొసలతో పలికించేవారని గుర్తు చేశారు. కానీ ఈనాటి సినిమాల్లో హీరోహీరోయిన్లు ఒకరికొకరు తాకినా పీకినా గోకినా శ్రుంగారం రావడం లేదు అని వ్యాఖ్యానించారు. దీనితో సభలో నవ్వులే నవ్వులు.
 
ఇంకా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... నేటి సినిమా ఇన్ స్టంట్ కాఫీలా మారిందనీ, ఒన్డే సినిమాలా మారిందన్నారు. ఒకప్పుడు రామానంద సాగర్ రామాయణం, మహాభారతం సీరియళ్లు వస్తున్నాయంటే అంతా పనులు ఆపేసి టీవీ ప్రోగ్రామును చూసేవారన్నారు. ఇప్పటి సినిమాల్లో సంగీతం, సాహిత్యం తక్కువైంది. వాయిద్యం ఎక్కువైంది. వాయించేస్తున్నారని అన్నారు.

వెబ్దునియా పై చదవండి