అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం మలయాళం రీమేక్ ప్రేమమ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే యూత్ భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో.. నాగచైతన్య కోసం మేనమామ.. విక్టరీ వెంకటేష్ అతిథి రోల్‌లో కనిపిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ పాత్ర సినిమాకు కీలకం కానుంది. కొద్ది నిమిషాల పాటే సాగే వెంకీ రోల్, నాగచైతన్యపై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యిందని సినీ యూనిట్ వర్గాల సమాచారం.
మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు ఇమేజ్‌ను లెక్కచేయని వెంకటేష్.. చైతూ అడగ్గానే ప్రేమమ్‌లో అతిథి రోల్‌లో కనిపించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇకపోతే.. తెలుగు ప్రేమమ్‌లో శ్రుతి హాసన్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కార్తికేయ ఫేం చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 12న సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.