వెంకీమామ ద‌ర్శ‌కుడు బాబీ నెక్ట్స్ మూవీ మెగా హీరోతో..?

గురువారం, 12 డిశెంబరు 2019 (19:17 IST)
ప‌వ‌ర్, స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్, జై ల‌వ‌కుశ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్ బాబీ. తాజాగా బాబీ,  విక్ట‌రీ వెంక‌టేష్, యువ సమ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. సురేష్ బాబు, విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.
 
 విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టిన‌రోజు కానుక‌గా డిసెంబ‌ర్ 13న వెంకీ మామ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి వెంకీమామ పై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌నే టాక్ వ‌చ్చింది. దీంతో ద‌ర్శ‌కుడు బాబీ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో బాబీ సినిమా ఉంటుంది అంటూ ప్ర‌చారం మొద‌ల‌య్యింది.
 
ఇదే విష‌యం గురించి బాబీని అడిగితే.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌లు విన్నాను. నాకు బ‌న్నీతో సినిమా చేయాల‌ని ఉంది కానీ.. ప్ర‌స్తుతానికి ఇంకా ఏమీ ఫైన‌ల్ కాలేదు. ప్ర‌జెంట్ నా ఆలోచ‌న అంతా వెంకీమామ పైనే ఉంది. నెక్ట్స్ మూవీ గురించి ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత ఆలోచిస్తాను అని చెప్పారు బాబీ. ఆయ‌న ద‌గ్గ‌ర‌ రెండు క‌థ‌లు సిద్ధంగా ఉన్నాయట‌. ఆ రెండింటిలో ఏ క‌థ‌తో సినిమా చేస్తాడో..? ఎవ‌రితో చేస్తాడో..?క్లారిటీ రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు