బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

ఠాగూర్

ఆదివారం, 10 ఆగస్టు 2025 (17:48 IST)
కడప జిల్లాలోని పులివెందుల జడ్జీటీసీ ఉప ఎన్నిక ఇపుడు రసవత్తరంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ఊరు, సొంత నియోజకవర్గం కావడంతో పులివెందుల జడ్పీటీసీ చైర్మన్ ఎన్నికపై ఇపుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ శ్రేణులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఖైదీల వేషాలు ధరించి డప్పులు వాయిస్తూ వీధుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. 
 
ఈ నెల 12వ తేదీన జరగనున్న జడ్జీటీసీ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికల పోలింగ్ కోసం ఈ ప్రచారం జరుగుతోంది. ఇందులోభాగంగా, బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా అనే నినాదంతో ముందుకు దూసుకెళుతున్నారు. పులివెందులలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు ఈ ప్రత్యేకమైన వేషాధారణంలో డప్పు వాయిద్యాల మధ్య నినాదాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
ఈ ప్రచార సరళి అందరిని దృష్టిని ఆకర్షిస్తోంది. ఖైదీల దుస్తుల్లో ఉన్న కార్యకర్తలు డప్పులు కొడుతూ ముందుకు సాగుతుండగా, మరికొందరు ఈ నినాదాన్ని గట్టిగా నినదిస్తున్నారు. ఈ వినూత్న ప్రచారానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.  


 

పొలిటికల్ హీట్ పెంచుకున్న పులివెందుల ZPTC ఉపఎన్నిక..

బాబాయిని చంపిన అబ్బాయి కు ఓటు వేద్దామా అంటూ టీడీపీ వినూత్న ప్రచారం

ఖైదీల వేషధారణతో డప్పు వాయిద్యాలతో టీడీపీ శ్రేణుల ప్రచారం

ఈ నెల 12వ తేదీన జరగనున్న పోలింగ్ pic.twitter.com/uGbBGSqcT3

— Bhavya???? (@unexpected5678) August 10, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు