బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ నట్ఖట్ 2021 బెస్ట్ షార్ట్ ఫిల్మ్ క్యాటగిరి ఆస్కార్ రేసులో నిలిచింది. అటు నట్ఖట్ సినిమాతోపాటు షేమ్ లెస్, షేవింగ్ చింటూ సినిమాలు కూడా ఈ క్యాటగిరిలో పోటీ పడుతున్నాయి. ఇక నట్‌ఖట్‌లో విద్యాబాలన్ తల్లి పాత్రలో నటించగా.. లింగ సమానత్వం, మహిళల పట్ల ద్వేషం తీరుతెన్నులను తన కొడుకును ఓ తల్లి బోధిస్తున్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.