'దొరసాని'గా జీవిత కుమార్తె - బుక్ చేసుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడు

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (09:14 IST)
సీనియర్ హీరో హీరోయిన్ జీవిత రాజశేఖర్ దంపతుల కుమార్తె శివాత్మిక. ఈమె "దొరసాని"గా వెండితెరపై అందాలు ఆరబోసేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో టాసీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం కానున్నాడు. పూర్తి ప్రేమకథా చిత్రంగా సాగుతున్న ఈ చిత్రం... తెలంగాణ నేపథ్యంలో కొనసాగనుంది. ఈ చిత్రానికి కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.
 
ఈయనకు గతంలో అనేక షార్ట్ ఫిల్మ్స్‌‌, యాడ్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహేంద్ర.. ఇప్పుడు 'దొరసాని' చిత్రాన్ని కూడా పూర్తి తెలంగాణ నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ తర్వలోనే విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో యాష్ రంగినేని, మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ ప్రమోషన్ చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు