ఈ సందర్భంగా హీరోయిన్ దియా సితెపల్లి మాట్లాడుతూ - తెలుగులో నా మొదటి సినిమా "ప్రేమకథ". ఈ చిత్రంలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం టీమ్ అంతా కష్టపడి పనిచేశాం. ఫస్ట్ మూవీ కాబట్టి నేను సెట్ లో చాలా విషయాలు నేర్చుకున్నాను. రెగ్యులర్ లవ్ మూవీస్ కు మా సినిమా భిన్నంగా ఉంటుంది. మీ అందరు సపోర్ట్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చేస్తున్నా. అని చెప్పింది.
యాక్టర్ వినయ్ మహదేవ్ మాట్లాడుతూ - ప్రేమ కథ సినిమాలో నేను యాదవ్ అనే క్యారెక్టర్ చేశాను. మీరు ట్రైలర్ లో చూసినట్లు ఇందులో ఒక 50 నుంచి 60 మందితో ఒక ఫైట్ ఉంటుంది. ఈ ఫైట్ లో ఫైటర్స్ ఎవరూ లేకుండా మొత్తం యాక్టర్స్ తోనే చేశారు. ఈ ఫైట్ మూవీకి ఒక హైలైట్ అవుతుంది. మా హీరో ఇవాళ ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. ట్రైలర్ రిలీజ్ కు రానందుకు బాధపడుతూ ఫోన్ చేశాడు. దాదాపు అందరూ కొత్తవాళ్లమే. అయినా ప్రతి ఒక్కరూ బాగా పర్ ఫార్మ్ చేశారు. అన్నాడు
యాక్టర్ విక్రమ్ మాట్లాడుతూ - గిరి అన్న ద్వారా నాకు "ప్రేమకథ" సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో శ్రీనివాస్ అనే క్యారెక్టర్ చేశాను. మంచి క్యారెక్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ విజయ్ అన్నకు, డైరెక్టర్ శివశక్తి గారికి థ్యాంక్స్. మేమంతా ఫ్రెండ్స లా టీమ్ వర్క్ చేశాం. "ప్రేమకథ"తో ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ విజయ్ మట్టపల్లి మాట్లాడుతూ - "ప్రేమకథ" సినిమాను దాదాపు అంతా కొత్తవాళ్లతో నిర్మించాం. థియేటర్ నుంచి వచ్చిన టాలెంటెడ్ యాక్టర్స్ మా సినిమాలో నటించారు. మాకు వర్థన్ దేవరకొండ గారు, మధుర శ్రీధర్ రెడ్డి గారు, శింగనమల కల్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. ఇవాళ మా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన హీరో విజయ్ దేవరకొండ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా సినిమా ప్రమోషన్స్ కు సపోర్ట్ చేసి ఫస్ట్ లుక్, సాంగ్స్ రిలీజ్ చేసిన హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్స్ హరీశ్ శంకర్, హనురాఘవపూడి, మారుతి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఒక జెన్యూన్ లవ్ స్టోరితో మా "ప్రేమకథ" సినిమాను నిర్మించాం. మీ అందరి సపోర్ట్ లభిస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.