తరుణ్ భాస్కర్ దాస్యం సినిమా డా కోలా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ

శనివారం, 28 అక్టోబరు 2023 (17:15 IST)
Vijay Deverakonda on keeda Cola poster
దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం మూడవ చిత్రం కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.  2వ తేదీన యుఎస్ఎ, కొన్ని ఇతర ప్రాంతాలలో ప్రీమియర్లు ప్రదర్శించబడతాయి. ఇదిలా ఉంటే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా, ప్రమోషన్ మెటీరియల్ హైప్ క్రియేట్ చేసింది.
 
రేపు హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరౌతున్నారు. విజయ్ దేవరకొండకు యూత్‌లో హ్యుజ్ క్రేజ్ వుంది. అతని ప్రజన్స్ ఈవెంట్‌ను స్మాసింగ్ హిట్‌గా మార్చి సినిమాకు ఎడిషనల్ బజ్‌ని సంపాదించడంలో సహాయపడుతుంది. ఈ ఈవెంట్ కు జనాలు పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
 
ఈ చిత్రంలో బ్రహ్మానందం వరదరాజులు తాతగా, చైతన్యరావు వాస్తుగా, రాగ్ మయూర్‌గా లాంచమ్‌గా, తరుణ్‌గా నాయుడుగా, సికిందర్‌గా విష్ణుగా, జీవన్‌కుమార్‌గా జీవన్‌రవీంద్ర విజయ్‌గా, షాట్స్‌గా రఘురామ్‌గా కనిపించనున్నారు.
 
సినిమాటోగ్రాఫర్ ఎజె ఆరోన్ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఉపేంద్ర వర్మ ఎడిటర్. ఆశిష్ తేజ పులాల ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ కాగా, తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ అందించారు. కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్,  ఉపేంద్ర వర్మ నిర్మించిన కీడా కోలా విజి సైన్మ మొదటి ఫీచర్-లెంగ్త్ ప్రొడక్షన్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు