సమంత కోలుకోవాలంటూ శుభాకాంక్షలు తెలిపిన విజయ్‌దేవరకొండ

గురువారం, 13 ఏప్రియల్ 2023 (17:17 IST)
Samantha, Vijaydevarakonda
సమంతకు  తాను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్‌ సందర్భంగా కొద్దిరోజులుగా ప్రచారంలో పాల్గొంది. ప్రయాణాలు చేయడంతో బడలికగా వుండడంతో ఆమెకు జ్వరం వచ్చింది. అందుకే ఆమె త్వరగా కోలుకొని మా ప్రియమైన శామ్‌ తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని విజయ్‌ దేవరకొండ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఖుషి సినిమాలో వారిద్దరూ కలిసి నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. మహానటిలో వారిద్దరూ కలిసి నటించారు.
 
ఏడాదిపాటు నువ్వు ఆరోగ్యం కొరకు పోరాడుతున్న విషయాన్ని ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. నీ ధైర్యానికి మెచ్చుకుంటోంది. నీ నవ్వు మర్చిపోలేనిది. మీ అభిమానులకు అది బూస్ట్‌లా వుంటుంది. అలాంటి నవ్వుతో రేపు విడుదలకాబోతున్న శాకుంతలం మంచి విజయం సాధించాలని  కోరుకుంటున్నాను. మిలియన్ల అభిమానులు కూడా చెరగనినవ్వుతో బయటకు రావాలని ఆశిస్తున్నారంటూ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు