ప్రభాస్ త్వరలో నూతన చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. సుజిత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక విశేషం తాజాగా వెల్లడైంది. ఇందులో విలన్ పాత్రధారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఈ పాత్రకు బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్‌ను ఎంచుకున్నారు.
ఇందులో ఆయన కవలలుగా నటిస్తాడని, వాటిలో ఒక పాత్ర విలన్ అయితే, మరో పాత్ర హీరోకి స్నేహితుడుగా కనిపించే పాజిటివ్ పాత్ర అని సమాచారం. ఈ రెండు పాత్రలు ఒకేలా ఉండడంతో పలుసార్లు హీరో కన్‌ఫ్యూజ్ అవుతాడట.