హాయ్ నాన్న, యానిమల్, తాజాగా జోరుగా హుషారుగా, రాబోయే సైందవ్ సినిమా అన్ని ఫాదర్ ఎమోషన్ సినిమాలే. అన్ని ఈ నెలలో విడుదల కావడం విశేషం. హాయ్ నాన్న సినిమాలో బేబి చిత్రంతో యువ ప్రేక్షకులను అలరించిన కథానాయకుడు విరాజ్ అశ్విన్ నటించాడు. ఆ సినిమాలో నాని పేరు విరాజ్. ఈ పేరు పై విరాజ్ స్పందన ఎలావుందంటే.. హాయ్ నాన్నచిత్ర దర్శకత్వం టీమ్ అంతా నా ఫ్రెండ్స్ కావడంతో ఆ సినిమాలో నటించాను. ఆ చిత్రంలో నాని విరాజ్ పాత్రలో కనిపించడం నిజంగా కో ఇన్‌సిండెంట్ అంతే. ఆ సినిమా షూటింగ్ సమయంలో విరాజ్ అంటే నేను పలకడం, హాయ్ నాన్న ప్రీరిలీజ్ వేడుకలో విరాజ్ అనగానే అందరూ నేను అనుకోవడం, ఇలా చాలా ఫన్నీగా, సంతోషంగా అనిపించింది అన్నారు.