నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

డీవీ

శనివారం, 22 జూన్ 2024 (18:41 IST)
Naga Chaitanya Sai Pallavi at Srikakulam
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "తండేల్" వైజాగ్, శ్రీకాకుళం షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.
 
నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొందిన "తండేల్" మునుపెన్నడూ చూడని లవ్ స్టొరీ. మ్యాసీవ్ బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ మూవీ ఇండస్ట్రీలో న్యూ టెక్నికల్ బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుంది. మేకర్స్ వైజాగ్, శ్రీకాకుళంలోని సహజమైన, అందమైన లోకేషన్స్ ని ఎంచుకున్నారు, నెరేటివ్ కి రియలిజంను జోడించడానికి లోకల్ కమ్యునిటీస్ ని విస్తృతంగా ఇన్వాల్ చేశారు.
 
నాగ చైతన్య, సాయి పల్లవి తో పాటు ఇతర కీలక నటీనటులు పాల్గొన్న ఇటీవలే ముగిసిన షెడ్యూల్ ఈ చిత్రానికి కీలకమైనది. ఇందులో చాలా ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు.
 
నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తమ కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇందులో డి-గ్లామరస్ అవతార్‌లలో కనిపిస్తారు.
 
దర్శకుడు చందూ మొండేటి పాత్రల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, ప్రాంతీయ యాస ప్రామాణికంగా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌, నేషనల్ అవార్డ్ విన్నర్  నవీన్ నూలి ఎడిటర్‌. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డిపార్ట్మెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం  విజువల్ గా మ్యూజికల్ గా ప్రేక్షకులు మెస్మరైజింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ని అందించబోతోంది.
 మేకర్స్ త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు