బాబోయ్ అతను నన్ను వేధిస్తున్నాడు... పోసాని కృష్ణమురళి ఫిర్యాదు

శుక్రవారం, 27 మే 2016 (21:25 IST)
ఇప్పటి సినిమాల్లో పుల్లవిరుపు మాటలు, కఠినమైన డైలాగులు చెప్పేవారు ఎవరయ్యా అంటే పోసాని కృష్ణమురళి పేరును చటుక్కున చెపుతారు. అంతటి నటుడే హడలెత్తిపోయే మాటలతో నరేష్ అనే వ్యక్తి బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోసాని. నరేష్ అనే వ్యక్తి డబ్బులు కావాలని తనను వేధిస్తున్నట్లు పోసాని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
తను డబ్బు ఇవ్వను అన్నందుకు తన నోటికొచ్చినట్టు తిడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి నోటి వెంట వచ్చే మాటలను తాను భరించలేకపోతున్నానని ఫిర్యాదు చేసిన ఆయన తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు వ్యక్తి గురించి వాకబు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి