"దిగు దిగు దిగు నాగ" పాటకు మస్తు రెస్పాన్స్.. (Video)

బుధవారం, 4 ఆగస్టు 2021 (13:17 IST)
Ritu varma
యువ హీరో నాగశౌర్య హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'వరుడు కావలెను'. ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్‌ను చిత్ర బృందం విడదల చేసింది. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాట ఇన్స్‌స్టాంట్‌ రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. 
 
తెలంగాణ జానపదం 'దిగు దిగు దిగు నాగ' అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు. థమన్ సంగీతం అందించగా ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. 
 
తాజాగా యూట్యూబ్‌లో విడుదలై ఈ పాట నెటిజన్స్‌ను ఎంతోగాను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని చేస్తున్నారు. త్వరలో విడుదల కానుంది. ఇక నాగశౌర్య నటిస్తున్న మరో సినిమా లక్ష్య. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల టీజర్ మంచి ఆదరణ పొందింది.
 
ఈ సినిమాలో నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొడుతున్నారు. ఆర్చరీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ లక్ష్య సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కీరవాణి కొడుకు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు