పబ్‌జీ గొడవా లేకుంటే ప్రేమ వ్యవహారమా..? స్నేహితుడి కాల్చి చంపేశాడు..

సెల్వి

శనివారం, 18 అక్టోబరు 2025 (14:07 IST)
Pub g
పాట్నాలో 18 ఏళ్ల యువకుడు పబ్‌జీ ఆడటంపై జరిగిన వివాదం కారణంగా కాల్పులు జరిగాయి. సోమవారం రాత్రి ఫుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలా బాగ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మహమ్మద్ అఫ్రోజ్ అనే బాధితుడిని అతని స్నేహితుడు మొహమ్మద్ చోటు రెండుసార్లు కాల్చి చంపాడని, ఒక బుల్లెట్ అతని తలకు దూసుకుపోయిందని తెలుస్తోంది. 
 
తుపాకీ కాల్పుల శబ్దాలు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని అఫ్రోజ్‌ను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. స్థానిక నివాసితుల ప్రకారం, కాల్పులకు రెండు రోజుల ముందు ఇద్దరూ పబ్ జీ కోసం గొడవ పడ్డారు. 
 
అయితే, ఈ సంఘటన ప్రేమ వ్యవహారంతో ముడిపడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఫుల్వారీ షరీఫ్ పోలీస్ సబ్-డివిజనల్ ఆఫీసర్ సుశీల్ కుమార్ ఈ సంఘటనలో ఇద్దరు స్నేహితుల ప్రమేయం ఉందని, దర్యాప్తు అన్ని కోణాల్లో జరుగుతుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు