Allu arjun family at apolo
మనవరాలు పుట్టటంపై మెగాస్టార్ చిరంజీవి మీడియా ముఖంగా స్పందించారు. మంగళవారం ఉదయం 1 గంట 49 నిమిషాలకు రామ్చరణ్, ఉపాసనలకు పాప పుట్టింది. ఇంటిల్లిపాది చాలా సంతోషంగా ఉన్నాం. ఈ పాప ఎంతో అపురూపం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్లు తల్లిదండ్రులై బిడ్డలను మా చేతిలో పెట్టాలని అనుకుంటున్నాం. ఇన్నేళ్లకు ఆ భగవంతుడి దయ వలన, అందరి ఆశీస్సులు వలన ఆ కోరిక నేరవేరింది. ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల నుంచి మా స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మా సంతోషాన్ని తమ సంతోషంగా భావించే అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ నా కుటుంబం తరపున ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను.