తెల్లవారుజామున 4.30 నిమిషాలకు ఆడపిల్లకు జన్మనిచ్చిన ఉపాసన కామినేని కొణిదెల

మంగళవారం, 20 జూన్ 2023 (08:35 IST)
upasana medical buletan
పెండ్లిఅయిన చాలాకాలం పిల్లలకు దూరంగా వున్న రామ్‌చరణ్‌, ఉపసాన ఎట్టకేలకు తల్లిదండ్రులు అయ్యారు. గత కొద్దిరోజులుగా ఉపసాన గర్భవతిగా వుండడం అందరికీ తెలిసిందే. ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాలో పాటకు ప్రపంచస్థాయి గుర్తింపు రామ్‌చరణ్‌కు వచ్చిన సందర్భంగా ఈ ఏడాది రెండు  అద్భుతమైన ఘటనలు జరగబోతున్నాయంటూ చెప్పారు. అందులో గ్లోబల్‌ స్టార్‌ కావడం ఒకటైతే రెండోది త్వరలో నా కుటుంబంలో మూడో మనిషి రాబోతుందంటూ వ్యాఖ్యానించారు.
 
కాగా, ఉపాసన 9నెలలు నిండుతున్నాయి అనగా హైదరాబాద్‌ జూబ్‌హిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు. మంగళవారంనా జూన్‌ 20న తెల్లవారుజామున 4.30 నిమిషాలకు  ఉపానసకు ఆడపిల్ల పుట్టింది. ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్‌ బులిటెన్‌ను మెగాస్టార్‌ చిరంజీవి వెల్లడిస్తూ, రామ్‌చరణ్‌ కొణిదెల,  ఉపాసన కామినేని కొణిదెలకు ఆడపిల్ల జన్మించింది. తల్లి, బిడ్డ క్షేమంగా వున్నారంటూ తెలియజేస్తూ ట్వీట్‌ పోస్ట్‌ చేశారు.

వెబ్దునియా పై చదవండి