ఒక్కో హీరోది ఒక్కో శైలి వుంటుంది. సినిమాకు కీలకం దర్శకుడు, హీరో, నిర్మాత. ఈ ముగ్గురు చెప్పినట్లే యాక్షన్ పార్ట్ చేయాలి. ఒకసారి రొటీన్‌గా అనిపించినా వారు ఓకే అంటే మేం చేయగలిగింది ఏమీలేదు. మహేష్‌బాబు సినిమా భరత్ అనే నేనుకు అలాంటిది ఓ సీన్ ఎదురైంది. రొటీన్ అయినా స్టయిలిస్‌గా వుండాలని చేయాల్సి వచ్చింది. అదేవిధంగా మాకు యాక్షన్ పార్ట్ చేసేటప్పుడే ఇది జనాలకు ఎక్కదు అని తెలుస్తుంది. అయినా ఒక్కోసారి రాజీపడాల్సివస్తుందని చెప్పారు. ఇక ఈ రంగంలో మాకూ శత్రువులు వున్నారు. దేవుడు అందరినీ ఒకేలా పుట్టించడు. ఏదో లోపం వుంటుంది. అలా వుంటేనే కాలం సాగుతుంది. మాకు కొత్తలో చాలామంది శత్రువులు వుండేవారు. కనిపించని శత్రువులు వారు. యాక్షన్ సీన్ కోసం అంతా స్టడీ చేశాక, ప్రాక్టీస్ చేశాక, ఒక్కోసారి షూటింగ్‌కు వచ్చాక కాన్సిల్ చేసేవారు. కొందరైతే కొంత పార్ట్ షూట్ అయ్యాక మమ్మల్ని మార్చేసేవారు అంటూ తమ మనోగతాన్ని వెబ్ దునియాకు వివరించారు.