మాస్ట్రో కోసం కష్టమైన నిర్ణయాలు తీసుకున్నాంః హీరో నితిన్

బుధవారం, 15 సెప్టెంబరు 2021 (16:23 IST)
Mastro prerelease
నితిన్‌ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'అందాధున్' రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈనెల 17న ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. నిన్న‌రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
 
నితిన్ మాట్లాడుతూ, ‘నా అభిమానులకు ముందుగా సారీ. కోవిడ్ నిబంధనల వల్ల ఫంక్షన్‌ను అంత గ్రాండ్‌గా నిర్వహించలేకపోయాం. హిందీలో అంధాదున్ కల్ట్ సినిమా. రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు భయం వేసింది. కానీ నటుడిగా నిరూపించుకునేందుకు రిస్క్ తీసుకున్నాం. దర్శకుడు ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడు. ఉన్నది ఉన్నట్టు తీస్తే ఏం తీశాడురా? అని అంటారు. మార్పులు చేర్పులు చేస్తే.. సోల్ లేదు చెడగొట్టారు అంటారు. కానీ గాంధీ మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీశారు. హిందీ సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో మన సినిమా కూడా అంత బాగుందని అనుకుంటారు.

మహతి సాగర్ పాటల కంటే ఎక్కువగా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కానీ పరిస్థితుల వల్లే ఓటీటీలోకి వస్తున్నాం. డీఓపీ యువరాజ్ పనితనం కూడా బిగ్ స్క్రీన్‌లో చూస్తే బాగుండేది. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ పని తనం కూడా బాగుంది. కానీ బిగ్ స్క్రీన్‌లో మిస్ అవుతున్నాం. ఈ సినిమా కోసం చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఈ సినిమాకు క్యాస్టింగ్ చాలా ముఖ్యం. విలన్ కోసం జిషును తీసుకున్నాం. టబు  పాత్రకు చాలా మందిని అనుకున్నాం. కానీ తమన్నా ఒప్పుకుంటుందా? లేదా? అనుకున్నాం. అలా ప్రతీ ఒక్క పాత్రకు సరైన నటీనటులు దొరకడం చాలా అరుదు. అలాంటి అరుదైన చిత్రాల్లో ఈ మాస్ట్రో కూడా ఒకటి అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ సినిమాను తీసినందుకు నిర్మాతలకు థ్యాంక్స్అ ని అన్నారు..
 
తమన్నా మాట్లాడుతూ,  ఈ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ తమ భాషలో  చేయాలని అనుకుంటారు.  ఈ ఆఫర్ నాకు వచ్చినప్పుడే చేయాలని ఫిక్స్ అయ్యాను. నితిన్ ఈ ప్రాజెక్ట్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. నితిన్‌తో మంచి లవ్ స్టోరీ చేస్తాను అని అనుకున్నాను. కానీ ఇలాంటి సినిమాతో చేయడం ఆనందంగా ఉంది. స్టార్డం ప్రేక్షకులు ఇస్తారు కానీ నటిగా గుర్తింపు తెచ్చుకోవడం మా చేతుల్లోనే ఉంటుంది  అని అన్నారు.
 
కాసర్ల శ్యాం మాట్లాడుతూ.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి మేర్లపాక గాంధీతో  పరిచయం ఉంది. ఆయనది టిపికల్ శైలి. ఎంతో మంచి కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాలో ఓ పాటను రాశాను. నితిన్ గారితో  బొమ్మోలే ఉందిరా పోరి,వాటే బ్యూటీ మంచి మాస్ హిట్ నంబర్స్ ఇచ్చాను. ఆయన కెరీర్‌లో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది. నితిన్ ఎంతో మంచి మనిషి. ఆయన నటను వందకు రెండు వందల శాతం ఈ సినిమాతో చూస్తాం. ఈ సినిమా విజయవంతం అవుతుందని, అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
రాజ్ కుమార్ ఆకేళ్ల మాట్లాడుతూ.. ‘అంధాదున్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాను నితిన్ గారు రీమేక్ చేసేందుకు సిద్దపడ్డాడు అని తెలిసినప్పుడు విజయం సాధించిందని నేను అనుకున్నాను. ప్రతీ ఒక్క పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రానికి సరైన దర్శకుడు దొరికారు. సినిమాలోని  ఆత్మను చెడకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తెరకెక్కించారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డిలతో  కలిసి  పని చేయడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.
 
నిఖితా రెడ్డి మాట్లాడుతూ.. ‘మాస్ట్రో సినిమా సెప్టెంబర్ 17న  విడుదల కాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. దర్శకుడు మేర్లపాక గాంధీ అద్భుతంగా తెరకెక్కించారు’ అని అన్నారు.
 
మేర్లపాక గాంధీ మాట్లాడుతూ,  ‘ఎప్పటి నుంచో నితిన్ భయ్యాతో చేయాలని అనుకున్నాను. కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. కానీ అంధాదున్ లాంటి ఆర్టిస్టిక్ సినిమాచేశాను.  నితిన్ అన్న బాగా చేశారు. తమన్నాను మిల్కీ బ్యూటీ అంటే ఏదోలా ఉంది. ఇప్పటి నుంచి తమన్నాను గ్రేట్ ఆర్టిస్ట్ అని  అంటారు. నభా కూడా అద్భుతంగానటించారు. మంగ్లీ, జిషు సేన్ గుప్తా, రచ్చ రవి, శ్రీముఖి ఇలా ప్రతీ ఒక్కరూ బాగా నటించారు. మహతి స్వర స్వాగర్ సంగీతం, నేపథ్యం సంగీతాన్ని అద్భుతంగా ఇచ్చారు. ఆయన ఫోన్ ఎత్తకపోయినా కూడా మంచి ఆల్బమ్ ఇచ్చారు. సెప్టెంబర్ 17న హాట్ స్టార్‌లో  ఈ సినిమా రాబోతోంది. సినిమా చూసి కచ్చితంగా పోలికలు పెడతారు. తిట్టడానికి అయినా పొగడటానికి అయినా సరే సినిమాను చూడండి’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు