అంబిక వధూవరుల కోసం డిజైన్ ప్రక్రియను ప్రారంభించింది. వారి ఇష్టాలు, అయిష్టాలు, ఇష్టమైన డెకర్ ఎంపికలు, సెలవులో టూర్ ప్రోగ్రామ్ గురించి ఓ ప్రశ్నావళిని వారికి ఇస్తారు. దానిని బట్టి హల్దీ, మెహందీ, అసలు పెళ్లి, రిసెప్షన్‌కి డిజైన్ మరియు కలర్ ప్యాలెట్ ఎలా డిజైన్ చేయాలో నిర్ణయిస్తుంది. ఈ విషయమై అంబిక ఇలా అంటోంది, "వాళ్ళిద్దరూ తమ ఇష్టాయిష్టాల గురించి చాలా నిర్దిష్టంగా చెప్పేవారు. అంతేకాకుండా డిజైన్ టీమ్‌పై చాలా నమ్మకాన్ని ఉంచారు. మేము వారి జీవితాల గురించి, వారు ఎలా కలుసుకున్నారు అనే విషయాల గురించి కూడా చాలా తెలుసుకున్నాము. వారి మొదటి చిత్రం మరియు గత 7 నుండి 8 సంవత్సరాలలో వారి ప్రేమ కథ ఎలా వికసించింది. వారు మాకు చెప్పినవన్నీ గ్రహించి సరైన థీమ్‌లను రూపొందించడంలో సక్సెస్ అయ్యాం.