అనీష్‌కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ మూవీ ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. యాక్షన్ కథ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. హీరోయిన్ షిర్లే సేతియాలతో పాటు ఈ సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ టైటిల్ త్వరలోనే ఖరారు కానుంది. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. హాస్యనటులు వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్యల కామెడీ హీలేరియస్‌గా ఉండబోతోంది. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ ఛాయగ్రాహకులు.