టాలీవుడ్ ప్రేమ జంట నాగచైతన్య, సమంత అక్టోబర్‌లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ప్రేమలో పడిన తర్వాత సమంతతో యుద్ధం చేశానని నాగచైతన్య అన్నాడు. చదువుకునే రోజుల్లో తల్లితో, ప్రేమలో పడిన తర్వాత సమంతతో యుద్ధం చేశానని ఓ ఇంటర్వ్యూలో చైతూ చెప్పుకొచ్చాడు. గతంలో రాఖీ కట్టేస్తానని సమంత తనను బెదిరించేదని చైతూ అన్నాడు.
అప్పట్లో తామిద్దరం ప్రేమలో పడ్డారని... కానీ ఈ విషయం ఎన్నాళ్లకు చైతూ ఇంట్లో చెప్పలేదు. దీంతో ప్రేమ విషయం ఇంట్లో చెప్పకపోతే సమంత తనకు రాఖీ కట్టేస్తానని బెదిరించేదని.. సమంత రాఖీ కట్టేస్తుందేమోనని భయంతో ఆ విషయాన్ని ఇంట్లో చెప్పేసినట్లు చైతూ తెలిపాడు. తాజాగా తన కొత్త సినిమా యుద్ధం శరణం ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ ఈ విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు.